Mpradeep.net

From Indian Web Showcase

Jump to: navigation, search

Title

నా బ్లాగు, నా సోది, నా నస.

Description

నా బ్లాగు, నా సోది, నా నస.

Address

Languages

English

External links

Start Page

నా బ్లాగు, నా సోది, నా నస.

  • ఇంగ్లీషు స్పెల్లింగులు
    మా US కొలీగ్ ఒకతని పేరు QIN అని చూసి క్విన్ అని పిలిచా, వెంటనే అతను క్విన్ కాదు చిన్ అని పలకాలని చెప్పాడు. మరి chin అనే రాసుకోవచ్చు కదా అని అడిగితే, అలా ఎందుకు పిలవాలో తెలుసుకోవడానికి ఈ వెబ్సైటుని చూడమన్నాడు.

    అది చూసిన తరువాత మా కొలీగ్ ఒకతను ఫిష్ స్పెల్లింగుకు ఈ గతి పట్టించాడు.
    - F-I-S-H; - ఇది మనందరికీ గుర్తుకొచ్చే స్పెల్లింగు.
    - G-H-T-I-O; GH as in రఫ్(rough), TIO as in నేషన్(NATION)


    --
    మరి మీకు కూడా ఇలాంటివి ఇంకేమన్నా తెలుసా...
  • ఈ సినిమా ఒక పజిల్

    పోయినాదివారం, హరేరాం సినిమా చూసా. మొదటగా ఆ సినిమా దర్శకుడు హర్షవర్దన్ గారికి కొత్తదనంతో నిండున్న ఇలాంటి సినిమాను అందించినందుకు నేనర్లు. అప్పుడెప్పుడో కల్యాణరాందే అతనొక్కడే సినిమా చూసా, అందులో సినిమా మొదట్లోనే, మిగతా సినిమా మొత్తం ఉత్సాహంగా చూడాలనిపించేటట్లు చేసే సన్నివేశం ఒకటి చూపిస్తాడు. ఆ తరువాత మిగతా సినిమా కొంతవరకూ బలమైన కధతో, ఊహించలేనన్ని మలుపులతో బాగానే నడుస్తుంది. ఆ సినిమా బాగుంది కాబట్టి, రెండు సినిమాలలో కల్యాణ్‌రాం ఉన్నాడు కాబట్టి, ఈ సినిమా కూడా బానే ఉంటుందేమోననే ఒక Transitive Relation ఏర్పరచేసుకుని, స్నేహితులతో పాటుగా చెన్నై నగరానికి 30కీమీల అవతల ఉండే మాయాజాల్ అనే మల్టీప్లెక్సులో చూడటానికి వెళ్లా.

    నా అంచనాలను ఏమాత్రం నిరుత్సాహపరచకుండా, సినిమా మొదట్లోనే కొన్ని సంకేతాలొచ్చాయి. సినిమా మొదటి గంటలోనే అనేకానేక మలుపులు తిరిగి, చూస్తుండగానే ఇంటర్వెల్ వచ్చేస్తుంది. ఇంటర్వెల్ వచ్చేంతవరకూ నా స్నేహితుడు, ఈనాడువాడి మీద కేసేద్దామని అనుకున్నాడంట (ఈనాడులో ప్రియమణి CBI అని రాసాడు, కానీ అప్పటి వరకు, ఆమె పాత్రకూ CBIకి ఎటువంటి సంభందం కనిపించదు మరి!!). అప్పటికే సినిమాలో వచ్చిన బోలెడన్ని మలుపులను చూడటంవలన మేమందరం ఇంటర్వెల్ తరువాత మిగతా కథ ఎలా ఉంటుందోనని తలా ఒక థియరీని ఏర్పరిచేసుకున్నాం.

    ఇంటర్వెల్ తరువాత సినిమాలో ఇంకొన్ని మలుపులతోనూ, ఆశ్చర్యకర సన్నివేశాలనూ కలుపుకుని సినిమా ముగుస్తుంది. అయితే మేము ఇంటర్వెల్ అప్పుడు ఏర్పరచుకున్న థియరీలన్నిటినీ కాకుండా దర్శకుడు తనదైన కొత్త థియరీతో సినిమాను నడిపిస్తాడు. అలా నేను తరువాత సన్నివేశంలో ఈ విధంగా జరుగుతుంది, అని అనుకుంటూ ఉంటే, సినిమా ఇంకో కొత్త మలుపు తిరిగి నేను అనుకున్నది జరగకుండా పోతుంది. అలా కొంతసేపటికి నేను ఏంజరుగుతుందో ఆలోచించటం మానేసి, మిగతా సినిమానంతా అక్కడ ఏంచూపిస్తే అది చూసా. మొత్తానికి సినిమా అయిపోయే సరికి నా మెదడు పాదరసంలా పనిచేయటం మొదలు పెట్టింది!

    ఈ సినిమాలో నాకు నచ్చినవి:
    1. పాటలు, ముఖ్యంగా యాఖుదా జర ధేఖోనా అనే పాట. ఈ పాటను ఇప్పటికే వరకూ కొన్ని వందల సార్లయినా వినుంటాను.
    2. అన్నిటికంటే ముఖ్యంగా సినిమాలో ఒక కథ ఉంది. చాలా రోజుల తరువాత కధ ఉన్న ఒక తెలుగు సినిమాను చూసాననిపించింది.
    3. క్లైమాక్సులో హీరోని పోలీసులూ, విలన్లూ కలిపి చేసింగు చేసే సన్నివేశం. ఈ సన్నివేశం చూస్తున్నప్పుడు నాకు NFS most wantedలో hot pursuit, వేరేవాళ్లు ఎవరో ఆడుతుంటే, ఆ ఆటను నేను చూస్తున్నట్లు అనిపించింది (ఆటలో ఉన్నట్లే హెలీకాప్టర్ కూడా ఉంటుంది)
    4. మామూలుగా అన్ని తెలుగు సినిమాలలో కార్లూ సుమోలూ దేన్నయినా(ముఖ్యంగా హీరో ప్రయాణించే కారుని) గుద్దుకుని గాలిలోకి ఎగరాల్సొస్తే నిట్టనిలువుగా పైకి ఎగురుతూ ఉంటాయి, ఈ సినిమాలో మట్టుకూ కొత్తగా పక్కకు ఎగురుతుంది.

    సినిమాలో నేను గమనించిన కొన్ని లోపాలు:
    1. కల్యాణ్‌రాం ఇందులో ఒక ACP పాత్ర పోషిస్తాడు. ఆ పాత్ర పేరు హరికృష్ణ, అయితే అతని యూనిఫాం మీద N.Krshna అనే పేరు ఉన్నట్లు అనిపించింది. ఇంకెవరైనా చూసి నేను చూసింది కరెక్టోకాదో చెప్పాలని మనవి.
    2. ఇంకో సన్ని వేశంలో సింధూ తులానీ పోషించిన పాత్ర ఆపదలో ఉంటుంది అలా ఆమె పరిగెట్టుకుంటూ వెళ్లి అప్పుడే మూసేయబోతున్న ఒక ఇంటర్నెట్టు కఫేలోకి వెల్తుంది. వెళ్లి తన పరిస్తితిని వివరిస్తూ, ఈమెయిలును టైపు చేసేస్తుంది. అంత టెన్షన్లోనూ ఆమె పారాగ్రాఫు మొదట్లో ఖాళీలను వదిలి, మిగతా పారాగ్రాఫునంతటినీ చాలా అందంగా అమరుస్తుంది, కింద తన సిగ్నేచరు కూడా టైపుచేసేస్తుంది. ఇదంతా కూడా outlook లాంటి సాఫ్టువేరు నుండి చేసేస్తుంది. అంత టెన్షనులో ఆమె తన ఈమెయిలుని outlookలో కాన్‌ఫిగరు చేసుకుని మరీ, ఈమెయులుని పంపిందంటారా.
    3. హై సెక్యూరిటీ CBI జైళ్లలో హీరో గారు తప్పించు కోవడానికి వెంటిలేటర్లు ఎల్లవేలలా ఉంటాయి. పైగావారికి తాగటానికి coke tinలను కూడా ఇస్తుంటారు. (ఇది సినిమా చూస్తే పూర్తిగా అర్థమవుతుంది).

    మొత్తానికి సినిమా ఎలా ఉందో ఒక్క ముక్కలో చెప్పమంటే గనక, నాకు ఒక పజిల్‌ని పరిష్కరించినట్లు అనిపించింది. అందుకనే కథ గురించి ఎక్కువగా చెప్పలేదు.
  • ఇప్పుడు నేను చెన్నైవాసిని
    నేటితో చెన్నై వచ్చి సరిగ్గా రెండు నెలలయ్యింది. ఇక్కడికి వచ్చె ముందు ఇక్కడి వాతావరణం గురించి అందరూ చాలా చాలా బయపెట్టారు, కానీ కొత్త ఉద్యోగం బాగా నచ్చి వచ్చేసాను. వచ్చిన తరువాత ఇక్కడి వాతావరనం విజయవాడ ఎండలు కంటే బానే ఉన్నట్లు అనిపించింది!!!

    వచ్చిన తరువాత మొదటి శనివారం మెరీనా బీచ్‌కి వెళ్లి సముద్రాన్ని చూద్దామని అనుకున్నాం. అయితే మొదటిసారిగా సముద్రమంటే నీళ్లతోనే కాకుండా జనాలతో కూడా తయారవుతుందని ప్రత్యక్షంగా చూసాం. శనివారం, ఆదివారాలు మాలానే ఇంకా చాలా మంది అనుకుంటూ ఉంటారని అక్కడికి వెళ్లిన తరువాత తెలిసింది. అప్పటికీ పట్టువదలని విక్రమార్కుల్లాగా సముద్రాన్ని చూద్దామని సముద్రపు ఒడ్డున ఉండే ఇసకమీద అలా నడుస్తూ నడుస్తూ నడుస్తూ చివరికి నీళ్ల దగ్గరకు చేరుకునే సరికి చీకటి పడిపోయింది. మొత్తానికి, ఇలాంటి ఇంకో సాయంత్రం అవుతుందని వెళ్లిన మాకు చాలా పెద్దనిరాశ.

    అలా కొన్ని రోజులపాటు ఎటూ వెళ్లకుండా, కొన్ని రోజుల తరువాత మళ్లీ ఏదో ఒక సముద్రపు బీచ్‌కి, అదీ జనాలు లేని బీచ్‌కి వెల్లాలని బాగా ప్లానేసి, స్కెచ్చుగీసి, చెన్నై నుండి 30కీమీల దూరంలో ఉండే మహాబలిపురం వెళ్లాలని నిర్ణయించాం. సాయంత్రమైతే చాలా మంది ఉంటారని, మధ్యాహ్నం అయితే ఎవరూ ఉండరని 10:30 కి బయలుదేరి 12 కల్లా అక్కడికి చేరుకున్నాం. ఒక గంట పాటు అక్కడ ఉన్న గుడిని, దాన్ని చూడటానికి వచ్చిన టూరిస్టులను చూసి, కొన్ని ఫొటోలు కూడా దిగేసాం.


    తరువాత ఆ గుడికే ఆనుకుని ఉండే సముద్రం దగ్గరకు వెళ్లాం. మిట్ట మధ్యాహ్నం ఒంటి గంటకు కూడా అక్కడ ఇంత మంది ఉంటారని ఏమాత్రం ఊహించలేదు. కాకపోతే మెరీనా బీచ్‌కంటే ఇది చాలానయం.


    మొన్నామధ్య సునామీ వచ్చినప్పుడు ఈ గుడి కూడా మునిగి పోయినట్టుంది, ఈ సారి గుడికేమీ జరగ కూడాదని, ఆ గుడికీ, దాని వెనుక ఉండే సముద్రానికీ మధ్యన పెద్ద పెద్ద బండరాళ్లతో నింపేసారు.


    తరువాత అక్కడున్న బండరాళ్ల మీద చాలా సేపు కూర్చుని, సముద్రపు అలలు వచ్చి ఈ బండరాళ్లను ఢీకొట్టటం చూస్తూ కూర్చున్నాం.


    ---
    ప్రస్తుతానికి "తమిళ్ తెరియాదు" అనే వాక్యాన్ని నేర్చుకున్నా. అదేంటో గానీ ఆ వ్యాక్యాన్ని ప్రయోగించిన ప్రతీసారీ ఎదుటోళ్లు ఇంకా ఫాస్ట్ ఫాస్ట్ గా ఏదో అరిచేస్తూ ఉంటారు... నేను తరువాత ఇంగ్లీషులో ఏదో మాట్లాడతాను, తరువాత వాళ్లు తమిళంలో ఇంకేదో మాట్లాడతారు. ఇదంతా కాదని చివరికు సైగలతోనూ, ఏకపద వాక్యాలతోనూ నెట్టుకురావడం మొదలుపెట్టా.

    ఇదే క్రమంలో మొన్నమధ్య దశావతారం సినిమాని తమిళంలో చూసా. సినిమా నాకు బానే అనిపించింది, కాకపోతే ఇంటర్వెల్ తరువాత వచ్చే అసిన్ పాత్రను కట్ చేసేసి అవతల పారేస్తే బాగుండేదనిపించింది; ఏంటో మరి ఆ పాత్రను మొదటిసారిగా చూపించే పాటలో తప్ప తరువాతంతా ఏదేదో అరుస్తూనే ఉంటుంది, చిరాగ్గా...
  • In the name of God

    ఈ సినిమా అసలు పేరు "ఖుదా కే లియే". ఇది నేను చూసిన మొట్టమొదటి పాకిస్తానీ సినిమా. అంతేకాదు, ఈ సినిమా భారతదేశంలో విడుదలైన మొట్టమొదటి పాకిస్థానీ సినిమా అంట... గతకొని సంవత్సరాలుగా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న రకరకాల పరిణామాల కారణంగా పాకిస్థానీయులు ఎదుర్కొంటున మానసిక సంఘర్షణను తెలియజేయడమే ఈ సినిమా కధాంశం ముఖ్యోద్దేశం. దాదాపు మూడు గంటల నిడివి వున్న ఈ సినిమాలో 5-6 గంటలకు సరిపడా కదాంశంతో, దర్శకుడు షోయబ్ మన్సూర్ సినిమాను చాలా ఆసక్తికరంగా మలిచాడు.

    సినిమా ఒక మెంటల్ రీహాబిలిటేషన్ సెంటర్లో మొదలవుతుంది. ఆ తరువాత పాకిస్తానులో 2000 సంవత్సరానికి స్వాగతం పలకటానికి సనద్దమవుతున యువకుల గుంపునొకదాన్ని చూపిస్తారు, ఇంతలో కొంతమంది బైకుల మీద కర్రలూపుకుంటూ వచ్చి, వారి సన్నాహాలన్నిటినీ పాడు చేసేసి వెళ్ళిపోతారు. ఆ తరువాత సీను లండనులో, షాపులో ఉన్న ఒక పాకిస్తానీయుడి వద్దకు అతని స్నేహితుడు వచ్చి, నీ కూతురు ఎవరో తెల్లోడితో తిరుగుతుంది, దానివలన నా కూతురు కూడా చెడిపోతుంది, ఆమెను అదుపులోపెట్టుకోవడం కూడా చేతకాదని తిడుతుంటాడు. ఇలా ఈ మూడు సనివేశాలలో దర్శకుడు మనకు సినిమాలోని ముఖ్యపాత్రలను పరిచయం చేస్తాడు.

    ఈ సినిమా ఇద్దరు అన్నతమ్ముల చుట్టూ తిరుగుతుంది. వాళ్లలో ఒకడు తీవ్రవాదంవైపు ఆకర్షితుడైతే, ఇంకొకడు తాను చేయని తప్పుకు (తీవ్రవాదం) బలిపశువైపోతాడు. ఇవే కాక తాలీబన్ల కాలంలో మహిళల పరిస్థితి, ఇస్లాంమతాచారాలను ఒక్కొక్కరూ ఒక్కోరకంగా ఎలా చూస్తారు అనేవాటిని కూడా ఈ సినిమాలో బాగా చూపించాడు. అలాగే తమకొచ్చిన సందేహాలను నివృత్తి చేసుకునే ప్రక్రియలో కొంతమంది పాకిస్తానీయులు మత చాందసవాదుల మాటలకు ఎలా లొంగిపోతారో ఈ సినిమాలో చాలా చక్కగా చూపించాడు. చివరిలో మౌలానా వలీగా ప్రత్యక్షమయ్యే నాసీరుద్దీన్ షా నటన గురించయితే ఇంక ఎంత చెప్పినా తక్కువే...

    సినిమా కథా కథనం ఒకెత్తయితే, ఇందులో పాటలు కూడా మళ్లీ మళ్లీ వినాలనిపించేంత బాగుంటాయి. అసలు నాకు ఈ పాటలు విన్న తరువాతే సినిమాను చూడాలనిపించింది. ఈ సినిమా 2007 కెయిరో చిత్రోత్సవంలో ఉత్తమ చిత్రంగా గెలుపొందింది. అంతే కాదు 2009 ఆస్కారు రేసులో కూడా ఉందిప్పుడు.
  • ఒక ప్రోగ్రాము కథ
    అనగనగా ఒక కంప్యూటరు మేధావి. అతనికి ఎల్లప్పుడు తన దగ్గరున్న కంప్యూటరుతోనే కాలం గడిపేసేవాడంట. అయితే అతనికి తన కంప్యూటరులో ఉన్న ప్రోగ్రాములు ఎప్పుడూ యంత్రాలకు మళ్లే, మనం నడవమన్నప్పుడు నడవటం, ఆగిపోమన్నప్పుడు ఆగిపోవడం చూస్తూ ఉండే వాడు. అవి వాటంతటవే జీవించగలిగేటట్లు చేస్తే ఎలా వుంటుందా అని ఎప్పుడూ కలలుగనే వాడు. కొన్ని సార్లు అతని కలల్లోకి, ఒక మగ ప్రోగ్రాము ఆడప్రోగ్రాము, వారి పిల్ల ప్రోగ్రామూ వచ్చేవి. ఇలా కొన్నిరోజులకు అతని కలల నిండా ఈ ప్రోగ్రాము కుటుంభమే కనిపిస్తూ ఉండేది.

    ఒక శుభముహూర్తాన ఇలా కాదని జీవించగలిగే ఒక ప్రోగ్రామును సృష్టించాలని అనుకున్నాడు. జీవులలో ఉండే ముఖ్యలక్షణాలు ఏంటా అని అలాచిస్తే అతనికి వచ్చిన జాబితా ఇదీ:
    1. సంతానాన్ని కలిగి తమ జాతిని అభివృద్ది పరచుకుంటాయి.
    2. తమపై ఇతరుల దాడిని నుండి తమను తాము రక్షించుకోవాలని చూస్తాయి.
    3. తమ ఉనికిని చాటే ఏదో ఒక లక్షణం కలిగి ఉండాలి.

    ఇలా ఒక ప్రోగ్రామును రాసుకున్నాడు, దానికి అతను self-reproducing automaton అనే పేరుపెట్టుకున్నాడు. ఈ ప్రోగామును తన కంప్యూటరులో నడపడం మొదలు పెట్టాడు. అయితీ ఇది పరాన్న జీవిలా ఇప్పటెకే ఉన్న ప్రోగ్రాములపై ఆధారపడుతుంది. వాటిని మొదలుపెట్టినప్పుడు ఇవి కూడా మొదలవుతాయి, కానీ ఇవి మొదలైనటు ఎవరికీ తెలియదు! అలా ఈ ప్రోగ్రాము తన వంశాన్ని అభివృద్ది పరచుకోవడానికి ఒక అన్ని మాంలు ప్రోగ్రాములలోకీ తన సంతానాన్ని వ్యాపింప చేసింది. అలా వ్యాపిస్తున్నప్పుడు తన గురించి ఎవరికీ తెలియకుండా అప్పటికే ఉన్న ప్రోగ్రాముల స్వభావాన్నికి ఎటువంటి ఆటంకం కలిగించకుండా ఉండేది. కానీ ప్రతీ ప్రోగ్రాములో ఈ ప్రోగ్రాము కలవటం వలన వాటి సైజు మాత్రం పెరిగి పోయేది, ఈ విధం దాని ఉనికిని పరోక్షంగా తెలిపుతూ ఉండేది.

    ఇలా ఈ ప్రోగ్రామును ఒక పెంపుడు జీవిలా సాకుతూ ఉండే వాడు. దానిని అభివృద్ది పరచటానికి రోజూ కొత్త ప్రోగ్రాములను తన కంప్యూటరులో స్థాపించేవాడు. మన ప్రోగ్రామేమో వాటిలోకి కూడా వ్యాపించేసి దిన దిన ప్రవర్ధమానం చెందేది. అయితే కొన్ని రోజులకు తాను తయారు చేసిన ఈ ప్రోగ్రాము ఏమేమి చేయగలదో అందరికీ చూపించాలని అనుకున్నాడు. ఉంట్టినే అందరినీ తన కంప్యూటరు వద్దకు తీసుకు వచ్చి చూపిస్తే పెద్దగా మజా ఉండదని, అతని కంప్యూటరుకు అనుసంధానమైన కంప్యూటర్లలోకి కూడా వ్యాపించగలగే సామర్ధ్యాన్ని కల్పించాడు. అలాగే ప్రోగ్రాము తన ఉనికిని బహిరంగంగా చాటుకునేటట్లు రూపొందించాడు.

    అయితే అతని కంప్యూటరుకు అనుసంధానమై ఉన్న అతని మితృలు, తమ తమ కంప్యూటర్లలో ఈ ప్రోగ్రామును చూసేసరికి, అది చేసే పనులు నచ్చక దానిని తొలగించడానికి ప్రయత్నాలను మొదలు పెటారు. అంతేకాదు ప్రోగ్రాముకు "కంప్యూటరు వైరస్సు" అనే కొత్త బిరుదును తగిలించారు. ఇది వైరస్సు కాదు నేను పెంచుకుంటున్న ప్రోగ్రాము, అని అతను ఎంత చెప్పినా అతని మిత్రబృంధం పెద్దగా పట్టించుకోలేదు. ఆ రకంగా జీవించగలిగే లక్షణాలున్న ప్రోగ్రాములన్నీ చెడ్డవైపోయాయి. అవి కంప్యూటరుకు ఎటువంటి హానీ తలపెట్టక పోయినా కూడా, వాటిని చెడగొట్టే ప్రాగ్రాములుగా అభివర్ణించడం మొదలుపెట్టారు.


    --- "The Little Black Book of Computer Viruses" చదివినప్పుడు నాకు కలిగిన ఆలోచనలకు రూపమే ఈ టపా...
  • అప్పుడేం జరిగిందంటే...
    సమయం ఉదయం 10 గంటలవుతుంది.
    [ఇంతకు ముందే వర్షం వడటం ఆగిపోయింది. ఎప్పుడూ సిమ్మెంటు ఫ్యాటరీ పొగగొట్టాల నుండి వచ్చే దుమ్ముతో మట్టి కొట్టుకుపోయుండే చెట్లంటినీ వర్షం నీరు కడిగేయటం వలన ఆకుపచ్చని రంగులో చాలా అందంగా కనబడ్తున్నాయి. మగవారంరూ ఫ్యాక్టరీకి వెళ్లిపోయారు, ఆడవాళ్లందరూ ఇళ్లలో పనులు పూర్తిచేసుకునే హడవిడిలో ఉన్నారు, ఇంక కాలనీ వీధిలో ఆ నలుగురు పిల్లలు తప్ప ఇంకెటువంటి జనసంచారం లేదు.]

    శ్రీనివాస్: అన్నా క్రికెట్ ఆడదామా. groundలో ఎవరూ లేరు.
    రాహుల్: we cannot, yesterday it rained heavily. And see how dirty the ground is.
    ప్రకాష్: అవునురా బాబు, రాహుల్గాడు చెప్పింది కరెక్టే ground అంతా ఎంత రొచ్చు రొచ్చుగా ఉందో చూడు.
    సుధాకర్: సెలవలు నిన్నే మొదలైనాయి, నాకేమో అప్పుడే bore కొట్టేస్తుంది. ఇంకేమైనా చేద్దాం.
    శ్రీనివాస్: (తన నిరాశను అనచుకుంటూ) కావాలంటే మిగతావాళ్లందైనీ నేనే పిలుచుకు వస్తాను... సీత కూడా మనతో క్రికెట్ ఆడతానంది.
    రాహుల్: (సుధాకర్ చెప్పింది పట్టించుకోకుండా) me too, feeling bored from the very first day of the holidays.
    ప్రకాష్: (ఆలోచిస్తూ...) hey rAhul, how about playing an indoor game in my house, say vaikunTapAli.
    సుధాకర్: (కంగారుగా...) లేదు లేదు ఇంకేమైనా చేద్దాం, ఇంట్లో మట్టుకు నేను ఉండలేను.
    ప్రకాష్: మీ ఇంటికి కాదులేరా మా ఇంటికని చెబుతున్నాలే... అవును అందరం అలా దేవీ సిమెంట్ వైపు వెల్దామా?
    సుధాకర్: వాళ్లు రానివరేమో...
    ప్రకాష్: వాడా గొడకట్టుకుని రెండు మూడు సంవత్సరాలవుతుంది, ఇంకా ఫ్యాక్టరీ కట్టడం కూడా మొదలు పెట్టలేదు, రానివ్వకపోవడానికి అక్కడ ఎవరన్నా ఉన్నారా అసలు...
    శ్రీనివాస్: అన్నా, అదిగో కాశీ కూడా వచ్చేస్తున్నాడు, మనమింకా క్రికెట్ మొదలు పెట్టేయ వచ్చు.
    ప్రకాష్: నోర్ముయ్యిబె, ఇందాకే చెప్పాగా ground అంతా రొచ్చు రొచ్చుగా ఉందని.
    (సుధాకర్ మొఖంలో ఇప్పుడు నిరాశ స్పష్టం కనిపిస్తుంది).
    ప్రకాష్: ఒరే కాశీ, మేము దేవీ సిమ్మెంట్స్ వైపు వెల్తున్నాం నువ్వూ వస్తావా...
    కాశీ: ఓ yes. తప్ప కుండా...

    సమయం 11 గంటలు కావొస్తుంది
    వాళ్లయిదుగురూ అలా నడుసుకుంటూ నడుసుకుంటూ, దేవీ సిమ్మెంట్సు వైపు వెళ్తున్నారు.
    సుధాకర్: రోజూ బస్సులో వెళ్తుంటే వెంటనే వచ్చేస్తుంది కదా, ఇవాళ నడుస్తుంటే ఇంకా రాటల్లేదేంటి.
    రాహుల్: hey look there is a spring flowing there...
    శ్రీనివాస్: ఏంటీ స్ప్రింగా, ఇక్కడెవరు పారేసుకున్నారు, (వెతుకుతున్నట్లు అటూ ఇటూ చూస్తున్నాడు).
    ప్రకాశ్: నీయబ్బ రాహుల్ చెప్పే స్ప్రింగు, అదిగో ఆ పిల్ల కాలవ గురించి.
    కాశీ: అదా... అది పక్కన పొలాల్లోనుండి వస్తుంది, మనం రోజూ స్కూలు కెళ్లేటప్పుడు మన ఫ్యాక్టరీ దాటంగానే ఒక చిన్న బ్రిడ్జీ వస్తుంది కదా... దాని కింద నుండీ వెళ్లేది ఈ కాలవే. అందులో చేపలు కూడా ఉంటాయి తెలుసా...
    శ్రీనివాస్: (కొంచెం ఉత్సాహంగా) ఏంటీ చేపలా.
    కాశీ: మరి ఎండా కాలంలో కూడా, ఈ కాలువలో నీళ్లుంటాయి.
    రాహుల్: hey! look this, look this, there are even fish in this water.
    ప్రకాశ్: yeah... thats what we are talking about.
    రాహుల్: hey all instead of playing cricket. why dont we come every day here and catch fish. I will sponsor for the fishing hooks and sticks...
    శ్రీనివాస్: ఏంమంటున్నాడు? ఈ చేపల్ని ఇక్కడే వదిలేసి వెళ్లి క్రికెట్ ఆడుకుందామంటున్నాడా?
    సుధాకర్: కాదురా బాబూ... ఈ సెలవలంతా క్రికెట్ ఆడే బదులుగా, రోజూ ఇక్కడికి వచ్చి చేపలుపడదామంటున్నాడు.
    శ్రీనివాస్: (మరింత నిరాశగా, కంగాఉగా) ఏంటీ సెలవలంతానా... వదొద్దు... నాకు క్రికెట్టె కావాలి.
    కాశీ: (సొంచెం నవ్వుతూ) ఈ రాహుల్గాడు వాళ్లూరిలో ఎప్పుడూ చేపల్ని చూసినట్టులేడులాగుంది. అసలు వాళ్లూర్లో ఇలా కాలువలు ఉంటాయో ఉండవో.
    రాహుల్: what kasi. you are saying something?
    కాశీ: (నవ్వునాపుకుంటూ) విన్నాడూ... (వచ్చీరాని ఇంగ్లీషులో) I talk worms.
    రాహుల్: साला... we need worms too, but where will we get them now.
    కాశీ: why worry? I here no.
    [కాశీ చుట్టూ చూసి ఒక కర్రముక్కను తీసుకుని అక్కడ బాగా చిత్తడిగా ఉన్న నేలను తవ్వడం మొదలు పెట్టాడు.]

    రాహుల్: kasi, what are you doing.
    ప్రకాశ్: ఎందుకు తవ్వుతున్నావురా.
    కాశీ: (తవ్వటం ఆపకుడా) వాన పాముల కోసం...
    [అలా అంటుండగానే ఒక వానపాము బయట పడింది. కాశీ గర్వంగా వానపాముని బయటకు తీస్తుంటే అందరూ నోరు తెరచి అలా చూస్తూ ఉండిపోయారు.]

    రాహుల్: man, you are really genius. how did you know you can get worms here?
    కాశీ: my grandfather. ఇలా కాలువల పక్కనే నేలలోపల వాన పాములుంటాయని మా తాతయ్య చెప్పాడు. సెలవలకు మా ఊరుకి వెళ్లినప్పుడు, తాతయ్య నన్ను చేపలు పట్టడానికి తీసుకెతాడు కూడా.
    [ప్రకాశ్, రాహుల్‌కి కాశీ చెప్పిందాన్ని ఇంగ్లీషులో చెప్పడం మొదలు పెడతాడు...]

    సుధాకర్: నేను సాయంత్రం మేళ్లచెరువు వెల్తున్నా... అందరూ డబ్బులిస్తే నేను కొక్కాలవీ తెస్తాను మరి.
    రాహుల్: so you are going to mellacheruv. here take this money and bring 5-6 hooks plastic wires. We can start our fishing from tommorow.
    శ్రీనివాస్: నాకాకలేస్తుంది, ఇంకా ఇంటికి వెల్దామా...
    ప్రకాశ్: what rahul, you always carry a 100 rupee note with you.
    [రాహుల్ గర్వంగా నవ్వాడు... తరువాత ఇంకొంచెం సేపు చేపల్ని పట్టడానికున్న మెలుకువలు గురించి మాట్లాడుకుని అందరూ ఇంటిదారి పట్టారు...]

    సమయం సాయంత్రం 5 గంటలు కావొస్తుంది...
    [బయట వీధిలో కొంతమంది హడావిడిగా తిరుగుతున్నారు.]
    గొంతు #1: నువ్వు చూసినప్పుడు ఎటెల్తున్నాడో, ఏమయినా చెప్పాడా...
    గొంతు #2: (శ్రీనివాస్ గొంతులా ఉంది) ఆ అక్కడ క్వారీలో వర్షం నీళ్లకు చెరువులా అయ్యిందని అక్కడికి ఈతకొట్టడానికి వెల్తున్నానని చెప్పాడు.
    గొంతు #3: (కొంచెం ఆందోలనగా...) ఈత కొట్టడానికి ఆ క్వారీనే దొరిందా... అయిన ఇంతసేపు ఈతకొట్టడమేంటి... అవును నువ్వెందుకెళ్లావటు?
    గొంతు #2: (కొంచెం భయం భయంగా) నేనటెల్లలేదు. నేను మేళ్లచెరువెళ్లి వస్తుంటే నాకు దారిలో కనిపించి క్వారీ దగ్గరికి వెళ్తున్నాడని చెప్పాడు.
    [కొంతమంది అటేపెల్తున్నట్లు సబ్దం, అక్కడే ఉన్న మిగతావాళ్లు గుసగుసలు మొదలుపెట్టారు.]


    సమయం సాయంత్రం 6:30 గంటలు కావొస్తుంది. అప్పటికే బాగా చీకటి పడుతోంది...
    [దూరం నుండి ఎవరో ఏడుస్తున్న శబ్దం. మెళ్లగా దగ్గరవుతుంది. ఎవరో ఒకాయన చేతిలో 10-12 సంవత్సరాల పిల్లోడిని రెండు చేతులతో మోసుకొస్తున్నాడు. అతను వీధి దగ్గరికి రాంగానే, అతని చేతిలో ఉన్న పిల్లోడి తాలూకూ తల్లి గట్టిగా ఏడవటం మొదలు పెట్టింది. ఎవరూ ఆమెను సముదాయించడానికి కూడా ప్రయతించలేదు.]
    గొంతు #3: ఎలా జరిగింది?
    గొంతు #1: (వస్తున్న ధుఖాన్ని బలవంతంగా ఆపుకుంటూ) క్వారీలో ఈ వర్షాలకు మొక్కలు కూడా పెరిగాయి. నీళ్లలో ఈ తకొడుతుంటే, ఆ మొక్కలు కాళ్లకు చుట్టుకున్నటున్నాయి...
    గొంతు #3: మొన్నట్నుంచే అక్కడ ఒక security gaurdని పెడదామనే ఆలోచనవచ్చింది, కానీ ఎందుకనో మర్చిపోయాను.
    గొంతు #1: వాడికలా రాసిపెట్టుంటే మీరయినా ఏంచేయగలర్లేండి...

    తరువాతి రోజు ఉదయం 10 గంటలయ్యింది.
    [అంతకు ముందురోజు రాత్రి వర్షం పడక పోవడంవలన చెట్లన్నీ ఫ్యాక్టరీ నుండి వచ్చే బూడిదతో కప్పేసుకుపోయాయి... groundలో క్రికెట్ ఆడటానికి సన్నాహాలు మొదలైయ్యాయి. సీత వికెట్లతో కుస్తీ పడుతుంది...]
    ప్రకాశ్: (అప్పుడే అక్కడికి వచ్చాడు) ఇదేంటి మనం ఇవాళ చేపలు పట్టడానికి వెళ్దామని అనుకున్నాంగా... మళ్లీ క్రికెట్టెందుకు?
    సుధాకర్: నిన్న నేనూ శ్రీనూగాడూ కలిసి మేళ్లచెరువు వెళ్లి అక్కడ కావలిసినవన్నీ కొన్నాం. ఇవాళ రాహుల్ వచ్చి ఇంక చేపలొద్దూ ఏంవద్దని, ఆ కొక్కేలనూ వైర్లనూ ఎక్కడో పరేసాడు.
    ప్రకాశ్: ఎందుకు పారేశాడు, మనకిస్తే మనమన్నా చేపలుపట్టుకోవడానికి వెళ్లేవాళ్లం కదా... అవునూ శ్రీనూగాడేడి కనపడటంలేదు, నిన్నంతా క్రికెట్ క్రికెట్ అని ఒకటే గొడవ చేసాడు.
    సుధాకర్: నీకింకా తెలీదా, శ్రీనూగాడికి బాగా జ్వరం అంట. అయినా కాశీగాడు అలా అయిపోతాడని వాడికయినా ఎలా ఊహిస్తాడు, పాపం.
    ప్రకాశ్: కాశీకేమయ్యింది?...
    సుధాకర్: (కొంచెం ఆశ్చర్యంగా మొఖంపెట్టి...) నిన్న ఆ క్వారీలో ఈతకొట్టడానికి వెళ్లి చనిపోయాడు, నీకింకా తెలీదా... అసలు శ్రీనూగాడికి జ్వరమొచ్చిం కూడా అందుకే. నిన్న కాశీగాడు కూడా మాతోపాటే మేళ్లచెరువొచ్చాడు. వెనక్కొస్తుంటే వర్షం పడటం వళ్ల క్వారీలో బాగా నీళ్లు చేరాయని ఈతకొట్టడానికి వెల్దామన్నాడు. నాకు వేరేపనుండటం వళ్ల నేనెల్లలేదు. శ్రీనూగాడూ, వాడూ వెళ్లారు. శ్రీనూగాడికి ఈతరాక ఒడ్డుమీదనే ఉన్నాడు, ఈతకొట్టడానికి నీళ్లలోని వెళ్ళిన కాశీగాడు ఎంతకీ బయటికి రాకపోవడంతో, వాడికేంచేయాలో తెలీక పరిగెట్టుకుంటూ ఇంటికి వచ్చి వాళ్ళమ్మకు చెప్పాడంట.... అందుకనే రాహుల్ మనం ఇంకా నీళ్ల దగ్గరకు కూడా వెళ్లకూడాదని నిన్న మేము కొన్న కొక్కాలనీ పారేసాడు...
    సీత: తొందరగా రండ్రాబాబూ, ఆట్టం మొదలు పెడదాం, మళ్లీ ఎండ వచ్చేస్తుంది...


    [ఇది వాస్తవంగా జరిగిన సంఘటనకు కొంత కల్పితాన్ని జోడించి రాసాను. పాత్రల పేర్లను కూడా మార్చాను. google mapsలో నేను చిన్నప్పుడు పెరిగిన ప్రదేశాలను చూస్తుంటే ఎందుకో ఈ సంఘటన గుర్తుకొచ్చింది, అందరితో పంచుకోవాలని ఇలా ...]
  • పైథాను భాష
    మీరు ఒక సాఫ్టువేరు ఇంజినీరయ్యుంటే పైథాను భాష గురించి పలువిధాలుగా ఇప్పటికే వినుంటారు. అన్ని కంప్యూటరు భాషలలోకీ నేర్చుకోవడానికి అత్యంత సులువైన భాష అనీ; ఇందులో రాసే ప్రోగ్రాములు ఇంగీషు భాషకు అతి దగ్గరగా ఉండి, ఇతరులు రాసిన ప్రోగ్రాములను కూడా చాలా సులువుగా అర్థం చేసుకోవచ్చనీ; ఇలా రకరకాలుగా వినే ఉంటారు.

    అయితే నేను ఈ మధ్యన చూసిన ఒక వెబ్సైటువలన పైథాను భాషను ఇంకో కొత్తకోనంలో చూడగలిగాను. అదేంటంటారా...

    పైథాను భాషను, మన మాతృభాషలో ఉన్న పదాలను ఉపయోగించి ప్రోగ్రాములు రాసుకునేటట్లు మలుచుకోవచ్చు. కామెంట్లు మాత్రమే కాకుండా, మొత్తంగా తెలుగులోనే ఉన్న ప్రోగ్రామును ఒకసారి ఊహించుకోండి... మామూలు తెలుగు వాక్యాలలో ఉండే ప్రోగ్రాములతో, ఎవరయినా చాలా సుల్వుగా ప్రోగ్రాములను రాసేయవచ్చు. అలా మాతృభాషలోనే ప్రోగ్రాములు రాయగలిగితే, రాస్తున్న వారికి కంప్యూటరు పరిజ్ఞానం కూడా పెద్దగా అవసరంలేదేమో...

    అయితే సమస్యల్లా అలాంటి పైథాను భాష ప్రస్తుతానికి చైనావారి లిపిలోనే లభ్యమవుతుంది. ఇది త్వరలోనే ఇతరభాషలకు కూడా విస్తరిస్తుందేమో చూడాలి. మరిన్ని వివరాలకు చైనా పైథాను భాషకోసం ఏర్పాటుచేసిన ఈ వెబ్సైటును సందర్శించండి. http://www.chinesepython.org/cgi_bin/cgb.cgi/english/english.html
  • బొమ్మలలోని భావాలు
    వంద మాటల్లో చెప్పలేని భావాన్ని ఒక్క బొమ్మతో చెప్పొచ్చంటారు. దానికి సరిగ్గా సరిపోయే బొమ్మ ఇది. "పై" అనే సంఖ్యకు 3.1415... అనే విలువ ఎలా వచ్చిందని అడిగితే, అది వృత్తం యొక్క వ్యాసానికి దాని చుట్టుకొలతకు మధ్యన ఉన్న నిష్పత్తి అని చెప్పొచ్చు. అలా కాకుండా కింద ఉన్న బొమ్మను చూపిస్తే ఎవరైనా సరే "పై" అంటే ఏమిటో చిటికెలో అర్ధం చేసుకుంటారు. అర్థం చేసుకోవడమే కాదు, దానిని ఇంక జీవితంలో మర్చిపోరు.


    వికీమీడియా కామన్సులో ఇటువంటి బొమ్మలు వేలకొలదీ ఉన్నాయి. చూడంగానే చూస్తూ ఉండిపోవాలనిపించే బొమ్మలు కూడా ఇక్కడ వేలలోనే ఉన్నాయి. క్రితం సంవత్సరం అప్లోడుచేసిన బొమ్మలలో అత్యుత్తమ బొమ్మలుగా ఎన్నుకున్న బొమ్మలను కూడా ఒకసారి చూడండి.
  • ఆణిముత్యాల్లాంటి రెండు సినిమాలు చూసాను
    మొన్నా మధ్యన షేరు మార్కెట్టులో అన్ని కంపెనీల షేర్లు ఒక్కసారిగా ఠపీ ఠపీమని పడిపోవటంతో, చేతులు కాల్చుకుంది చాలని దాని జోలి వెళ్లటం మానేసాను. అయితే అలా షేరు మార్కెట్లో జరుగుతున్న మార్పులను చూడక పోవటం వలన చాలా ఖాళీ సమయం దొరికి ఇదిగో ఇలా కొన్ని ఆణిముత్యాల్లాంటి సినిమాలు చూసాను.

    అలా చూసిన మొదటి సినిమా ప్రేమికులు. ఈ సినిమా ఎప్పుడో 2005లోనే విడుదలైయింది. మామూలుగా అయితే ఈ సినిమాను చూసే వాడిని కాదు, కానీ నా రూంమేటు ఈ మధ్య తెలుగు సినిమాల సీడీలు తెగకోనేస్తూ ఉండటం వలన ఈ సినిమాను నేను కూడా చూడాల్సొచ్చింది. ఒకే కథతో రెండు సినిమాలను తీసి, ఆ రెండు సినిమాలనూ పక్కపక్కనే అతికించేస్తే తయారయ్యిందే ఈ సినిమా. మొదటి భాగంలో (అదే మొదటి సినిమాలో) ప్రేమికుల ఇంట్లో పెళ్లికి ఒప్పుకోకపోవటంతో, మేడమీద నుంచి దూకి ఆత్మహత్య చేసుకోబోయి, ఇసకలారీలో పడి గతం మర్చిపోతారు. రెండో సినిమాలో "అనుకోకుండా" కలుసుకుని మళ్లీ స్నేహితులయిపోతారు, కానీ వాళ్లకు వారి ప్రేమ గుర్తుకురాదు. వాళ్లకు గుర్తొస్తుందా, రాదా, అని మనం ఎంతో ఆతృతగా సినిమా చూస్తూ ఉంటే చివరాఖరున హీరోయిన్ పెళ్లయిపోయి అరుంధతీ నక్షత్రం చూస్తున్నప్పుడు, ఈ ప్రేమికుల కాలు జారి ఈతకొలనులో పడిన తరువాత వాళ్లకు, అప్పటికే తామిద్దరూ ప్రేమికులని గుర్తొస్తుంది. అప్పటికి మూడో సినిమాకోసం ఎదురు చూస్తున్న మాకు సినిమా అయిపోయినట్లు తెలిసి కొంచెం నిరాశ కలిగింది :(

    సినిమాలో నాకు బాగా నచ్చిన సన్నివేశాలు రెండున్నాయి. ఈ రెండు చూట్లా మొత్తం సినిమా యునిట్టంతా చాలా బాగా కష్టపడ్డారు. అదేంటంటే హీరో-హీరోయిన్లు మేడమీద నుండి దూకు ఆత్మహత్య చేసుకోవాలను కునే సన్నివేశం ఒకటి, ఆ తరువాత చినిమా చివరణ కాలు జారి ఈతకొలనులో పడిపోయే సన్నివేశం ఇంకోటి. సాధారనంగా ఎవరయినా మేడమీదనుండి దూకి కొంద పడిపోవడానికి 5 సెకండ్లు పడిపోతుందేమో. కానీ అలా చూపిస్తే మన కెమెరామ్యాను పనితనం, స్టంటు మాస్టారు పనితనం సరిగ్గా చూపించలేమని, ఈ సన్నివేశాలను స్లో మోషన్లో చూపిస్తారు. అలా తీయడం వలన మేడమీదనుండి కింద పడిపోయే వాళ్లమొఖాలలో ఎటువంటి హావభావాలు పెడతారు, వాళ్లు కాళ్లెలా ఆడిస్తారు, చేతులేలా ఆడిస్తారన్నే విషయాలన్నీ డైరెక్టరుగారు మనకు చాలా బాగా వివరిస్తారు. ఈ వివరణంతా మనం ఎక్కడ మర్చి పోతామేమోనని క్లైమాక్సులో ఇంకోసారి హీరో-హీరోయిన్లను మేడమీదనుండి తోసేసి మనతో రివిజను చేపిస్తారు. సరిగ్గా గుర్తులేదు కానీ హీరో-హీరోయిన్లు మేడమీదనుండి పడిపోయేలోపట నేను వెళ్లి ఒక మాగీ ప్యాకెట్టు కొని తెచ్చుకుని వండుకుని తినేశాను, అంత వివరంగా చూపిస్తారు.

    ఇప్పటికే ఈ సినిమాను చూడకపోతే గనక మీరీ సినిమాను తప్పక చూస్తారని ఆశిస్తున్నాను. పైగా ఈ సినిమా Eternal Sunshine of the Spotless Mind అనే ఇంగ్లీషు సినిమాలానే ఉందంత, ఇందుకోసమైనా మీరీ సినిమాను తప్పక చూడాలి. చూసిన తరువాత సినిమాపై మీ అభిప్రాయాన్ని చెప్పటం మర్చిపోవద్దే.


    నేను చూసిన రెండో సినిమా ఒక ఇంగ్లీషు సినిమా National Treassure: Book of Secrets ఈ సినిమా కూడా పై సినిమా లాగానే, ఒకే కథతో రెండు సినిమాలు తీసేసారు, అయితే ఇంగ్లీషోడు కొంచెం తెలివిగా దానిని రెండు సినిమాలుగా విడుదలచేశాడు. అయితే ఈ సినిమాలో కొత్తదనం లేదా అంటే ఉంది. మొదటిదాంట్లో ఎదో ఒక మ్యూజియంలోకి చొరబడి బయటకు వచ్చేస్తారు. ఈ సారి ఏకంగా బక్కింహాం ప్యాలెసులోకీ, స్వేతసౌధంలోకి మంచినీళ్లు తాగినంత సులువుగా చొరబడి మళ్లీ బయటకు వచ్చేస్తారు. అంతెందుకు అనుకున్నదే తడవుగా అమెరికా ప్రెసిడెంటునే కిడ్నాపు చేసిపడేస్తాడు మన హీరో.

    cost cutting సూచనలు ఈ సినిమాలో బాగా కనిపించాయి, ఉదాహరణకు మొదటి సినిమాలో నిధి ఉన్న ప్రదేశంలోకి చేరిన తరువాత హీరో ఒక లైటు వెలిగిస్తాడు, వెలిగించిన ఆ మంట కాస్తా ఎంతో పెద్దగా ఉన్నా భావనంమొత్తం పరుచుకుని బోలెడంత వెలుగునిస్తుంది, ఈ సినిమాలో కూడా మళ్లీ హీరోనే నిధిని కనుక్కుని అక్కడ పక్కనే కనిపించే పాత్రలో మంటను వెలిగిస్తాడు, కానీ ఈసారి ఎదో కొంచెం ప్రదేశం మాత్రమే వెలుగుతుంది. నిధిలో బంగారం కూడా మొదటి సినిమా అంత పెట్టలేదు. అయితే డైరెక్టరు డబ్బునంతా సినిమా తారాగణాన్ని ఎన్నుకోవటంలో చూపెట్టాడు. ఈ సినిమాలో నికోలస్ కేజ్, హెలెన్ మిరెన్, జాన్ వోయిట్లు ఆస్కారు అవార్డు గెలుచుకోగా, ఎడ్ హారీస్, హార్వే కేయిటెల్లు ఆస్కార్ నామినేషను వరకూ వెళ్లారు. వీళ్లందరినీ తీసుకుని కొత్త కథను తీసుకోవడంలో cost cutting చేసేసినట్లున్నాడు మన డైరెక్టరు జాన్ టార్టెల్టాబుగారు. మొదటి సినిమాలో ఉన్నట్లే ఇందులో కూడా ఒక చేసింగు సీను ఉంటుంది, మొదటి సినిమాలో లాగానే పాతాళలోకంలోకి పోయే ఒక పేద్ద నిలువు సొరంగం ఉంటుంది. అయితే ఈ సారి విలనెనకమాల మొదటి సినిమాలో ఉన్నంత అనుచరగణం ఉండదు (cost cutting), కాబట్టి మన దృష్టినంతా ముఖ్య పాత్రలపైనే పెట్టి సినిమాను ఇంకా బాగా అస్వాదించవచ్చు. ఇందు మూలంగా నేను చేప్పేదేమిటంటే మీకు మొదటి సినిమా నచ్చితే, ఈ సినిమా కూడా మీకు బాగా నచ్చుతుంది, అది నచ్చక పోయినా సరే ఈ సినిమా మీకు నచ్చేస్తుందని నా ప్రగాడ విశ్వాసం. కాబట్టి ఈ సినిమాను కూడా మీరు తప్పక చూసేయాలి.

    కొసమెరుపు: ఈ ఆణిముత్యాల్లాంటి సినిమాలను చూసిన తరువాత ఒక్క సారిగా, షేరు మార్కెట్టు మరీ అంత చెడ్డదేమీ కాదని అనిపిస్తుంది.
  • మీడియావికీని అనువదించటానికి ఇంకో కారణం
    మీలో చాలా మందికి తెలుగు వికీపీడియా, మరియు ఇతర అన్ని వికీపీడియాలకు మీడియావికీ అనే సాఫ్టువేరును వాడతారని తెలిసే ఉంటుంది. అయితే ప్రస్తుతం ఈ మీడియావికీ సాఫ్టువేరు User Interfaceను ప్రపంచంలో ఉన్న అన్ని భాషలలోకి అనువదిద్దామనే ఒక ప్రాజెక్టును మొదలుపెట్టారు. అందుకోసం, అనువదించటాన్ని సులభతరం చేయటానికి బేటావికీ అనే సాఫ్టువేరును కూడా తయారు చేసారు. ఈ సాఫ్టువేరును మీడియావికీ డెవలపర్లు తయారు చేసారు, వారే దీని నడుపుతున్నారు.

    ఈ బేటావికీ సాఫ్టువేరును ఉపయోగించి, ఆ సాఫ్టువేరులో వాడే కొన్ని వాక్యాలను నేను అనువదించాను. ఇంకొన్ని అప్పటికే తెలుగు వికీపిడియాలో ఉన్న నిర్వాహకులు అనువదించేసారు. అనువదించటానికి మిగిలిపోయిన వాక్యాలు ఇంకా బోలెడన్ని ఉన్నాయి. ఈ సాఫ్టువేరును అనువదించటం పూర్తయితే, తెలుగు వికీపీడియా మొత్తంగా తెలుగులోనే కనపడుతుంది, ఇలాంటి మరియు ఇలాంటి వెబ్సైట్లన్నీ పూర్తిగా తెలుగులోనే ఉంటాయి. అంతే కాదు ఇతర భాషల వికీపీడియాలను కూడా తెలుగులోనే చూసుకోవచ్చు. ఉదాహరణకు: ఇంగ్లీషు వికీపీడియాను తెలుగు UIతో చూడండి (అక్కడ "ఇటీవలి మార్పులు", "మూలాన్ని చూపించు" లాంటి తెలుగు వాక్యాలను చూడవచ్చు).

    బేటావికీ సాఫ్టువేరును ఉపయోగించి మీడియావికీలో వాడే వాఖ్యాలను చాలా సులువుగా అనువదించేయవచ్చు. అనువదిస్తున్నప్పుడు ఆ వాక్యాలను ఏ సందర్భంలో ఉపయోగిస్తున్నారు, ఎక్కడ ఉపయోగిస్తున్నారు, దానిని ఇప్పటికే ఎవరయినా అనువదిస్తే ఆ అనువదం ఏమిటి లాంటి వివరాలన్ని చూపిస్తూ మనకు అనువదించటానికి చాలా సహాయకారిగా ఉంటుంది.

    బేటావికీ సాఫ్టువేరు ఒకెత్తయితే, అనువదించేసిన తరువాత మనం పారితోషకం కూడా పొందవచ్చు. అందుకోసం వారు ఒక్కో భాషకూ 293 డాలర్లను (సుమారు 11500 రూపాయలు) కేటాయించారు. అంటే మీడియావికీలో ఉన్న వాక్యాలను మొత్తం తెలుగులోకి అనువదించి, పారితోషకం కావాలని అడిగిన వారందరికీ కలిపి 293 డాలర్లను ఇస్తారు. అనువదించే పనిని నాలుగు మైలురాళ్లుగా విడగొట్టారు, ప్రతీ మైలురాయి ఇంతని కేటాయించారు. మీరు చేసిన అనువదాల వలన తెలుగు భాష ఫలానా మైలురాయిని చేరుకుంటే, ఆ మైలురాయికి కేటాయించిన మొత్తాన్ని పారితోషకంగా కోరవచ్చు. మీకు ఇతర భాషలు కూడా తెలిసుంటే ఆ భాషలకు కూడా అనువదించేసి అక్కడ కూడా పారితోషకాన్ని పొందవచ్చు. (ఒక ముఖ్య గమనిక, నేను కేవలం సమాచారాన్ని మాత్రమే అందిస్తున్నాను ఆ పారితోషకానికి నాకు ఎటువంటి సంభందం లేదు). మీరు కావాలనుకుంటే పారితోషకం తీసుకోకుండా కూడా పని అనువదించేయవచ్చు, అప్పటికే పూర్తిచేసిన అనువదాలను సరి చేయవచ్చు కూడా.

    ప్రస్తుతం బేటావికీలో ఉన్న మీడియావికీ అనువాద గణాంకాల ప్రకారం సుమారు 38% పూర్తయింది (నాలుగు మైలురాళ్ళ సగటు). మరింకెందుకు ఆలస్యం మీడియావికీని త్వరత్వరగా అనువదిద్దాం రండి. అనువదించటం మొదలుపెట్టే ముందు బేటావికీలో సభ్యత్వం తీసుకోవాలి, సభ్యత్వం తీసుకున్న తరువాత అక్కడ అనువదించగలగటానికి హక్కులను కోరుతూ Betawiki:Translators అనే పేజీలో విజ్ఞప్తి చేయాలి (24 గంటల లోపటే మీకా హక్కులను ఇచ్చేస్తారు).
  • బాగా బోరుకొడుతుందా...
    మీకు నిజంగానే బోరుకొడుతుందా? అయితే మిగతా పోస్టును కూడా చదివేసి ఆ తరువాత పక్కనున్న ఈ బొమ్మపై నొక్కి ఆటను అడేయండి. ఈ ఆటను ఫైరుఫాక్సులోనే ఆడగలరు, IEలో పని చేయకపోవచ్చు. నాకు కూడా రెండు మూడు నెలల క్రితం బాగా బోరుకోట్టి ఈ ఆటను తయారు చేయడం మొదలు పెట్టాను. కొంత మంది దీనిని చుక్కలాట లేదా చుక్కలు-డబ్బాలాట అని కూడా పిలుస్తారు. ఈ ఆట గురించి మరింత తెలుసుకోవడానికి ఆంగ్ల వికీపీడియాలో ఉన్న ఈ వ్యాసాన్ని చదవండి. బీటెక్ చదువుతున్నప్పుడు క్లాసు బోరు కొడుతున్నప్పుడల్లా పక్కన కూర్చున్నోడితో ఈ ఆట ఆడే వాళ్ళం. ఒక సారి పరీక్షలకు చదువుదామని నోట్సు తీస్తే అందులో నాకు నోట్సు కంటే కూడా ఈ గీతలే ఎక్కువ కనపడ్డాయి!!!

    ఆటను తయారు చేయడం నెల రోజులలో పూర్తయిపోయింది. కంప్యూటరే ఆలోచించి ఎత్తులువేసేటట్లుగా తయారుచేసాను. ఆ తరువాత ఇంకో నాలుగైదు రోజులు కష్టపడి, ఈ ఆటను w3 standardsకి తీసుకుని వచ్చాను. (ఈ ఆటను పూర్తిగా DHTMLలోనే రాశాను). అంతే కాదు ఫ్లాషు గానీ అప్లెట్టులు కానీ వాడకుండా ప్రోగ్రామును SVG+javascript లోనే రాసేసాను. అంటే నేను మీకు ఆటతోపాటు దాని సోర్సుకోడును కూడా ఇచ్చేసున్నాన్నమాట. మీరు ఈ ప్రోగ్రామును తీసుకుని మీ ఇస్టమొచ్చినట్లు మార్చుకోవచ్చు కూడా.

    మీలో సోర్సుకోడును చూసేవాళ్ళు చాలామంది ఉంటారనే అనుకుంటున్నాను. అలా చూసేవాళ్ళకు ఒక చిన్న పరీక్ష. ఇందులో ఆటను మూడో లెవెల్లో ఆడేటప్పుడు కంప్యూటరు ఎత్తులువేయటంలో ఒక చిన్న పొరపాటు చేస్తుంది. ఆ పొరపాటు ఏమిటి? అలా ఎందుకు చేస్తుంది? దానిని సరి చేయడానికి ఏం చేయాలి? ఆ పురుగును పట్టుకోగలరేమో చూడండి!!!
  • ఒక్క కాలు కాకి
    మొన్న ఆరు కాళ్ల సాలీడుని చూసారు ఇప్పుడు, ఒకే కాలు ఉన్న కాకిని చూడండి. ఈ వీడియోను సుమారు రెండు సంవత్సరాల క్రితం NITKలో MTech చేస్తున్నప్పుడు చిత్రీకరించాను...


    ఈ కాకులకు వేరుశనగ పలుకులు విసురుతున్నాము, అందుకే మా చుట్టూ తిరుగుతున్నాయి. మొత్తమన్ని కాకులూ వేరుశనగ పలుకులను నేలమీద పడక ముందే తినాలని వాటిని మేము విసురుతున్నప్పుడు గాలిలోనే అందుకునేవి. కొన్నయితే రెండు మూడు పలుకులను ఒకేసారి అందుకోవాలని ప్రయత్నించేవి. కానీ మొత్తానికి వేరుశనగ పలుకులను గాలిలోనే, చాలా బాగా అందుకునేవి. బెంగుళూరు వచ్చిన తరువాత కాకులను ఒక్కసారి కూడా చూసిన గుర్తులేదు!
  • ఆరుకాళ్ళ సాలీడు
    Spider Hanging
    అసలు పరిమాణం
    కొన్ని రోజుల క్రితం ఒక ఆదివారం రోజు నిద్ర లేస్తూనే ఇలా వేలాడుతూ కనిపించింది. అంత పెద్ద సాలీడును నేను ఇంతవరకూ చూడలేదు. పైగా చాలా సేపు కదలకుండా అలాగే వేలాడుతూ ఉంది. వెంటనే కెమరాతీసి ఒక క్లిక్కు క్లిక్కాను. ఫ్లాష్ వెలుతురుకి బయపడింది కావచ్చు, వెంటానే కిందకు జారి...

    'Six' legged spider
    అసలు పరిమాణం
    ఇలా ఒక తలుపు సందులోకి వెళ్ళి దాక్కుంది, ఈ సారి మెళ్ళగా తలుపును తెరచి దగ్గరి నుండి ఇంకో ఫొటో తీసాను, ఈ సారి ఇంకా తొందరగా ఎక్కడికో వెళ్ళి మాయమైపోయింది.

    బొమ్మలను కంప్యూటరులో ఎక్కించిన తరువాత, దీనికి ఒక పక్కన నాలుగు కాళ్ళకు బదులుగా రెండే ఉన్నాయని గమనించాను. అందుకే గావచ్చు ఎక్కడో under groundలో ఉండాల్సింది ఇలా బయటకు వచ్చింది!!!
  • ఒకప్పటి IT నిపుణుడు!
    IT నిపుణుల కష్టాల గురించి బొలెడన్ని రకాలుగా, కధలు కధలుగా చెబుతూ ఉంటారు. అసలు ఆ వృత్తి ఎందుకు కష్టంగా ఉంటుందో ఈ యూట్యూబులో ప్రదర్శిస్తున్న ఈ చిత్రాన్ని చూసి తెలుసుకోండి...

  • స్టాకు మార్కెట్టు???
    కొన్ని నెలల క్రితం బ్లాగ్‌షేర్స్ అనే సైటులో నా బ్లాగులో షేర్లను అమ్మకానికి పెట్టి నేను నా మొటమొదటి షేర్ల వ్యాపారాన్ని మొదలు పెట్టాను. అక్కడ డబ్బు తప్ప మిగతాదంతా నిజంగానే జరుగుతుంటుంది. ఆ రకంగా కొన్ని రోజులు అక్కడ షేర్ల ఆట ఆడాను. అలా అక్కడ వేరే బ్లాగులలో షేర్లను కొంటూ అమ్ముతూ ఉంటే కొన్ని రోజులకు నా బ్లాగులో నా దగ్గర ఉన్న వాటాకంటే ఎక్కువ వాటాను ఇంకోడెవడో కొట్టేసాడు. నా బ్లాగు నాకు కాకుండా ఇంకోడెవడి దగ్గరో ఉండటమేమిటని (అప్పటికి ఆ సైటు బోరుకొట్టటం మొదలైయింది), ఆ సైటుకు వెళ్లటం మానేసాను. 1000 బ్లాగు డాలర్లతో మొదలు పెట్టి ఆరేడు నెలల్లో సుమారు 500,000 బ్లాగు డాలర్లు సంపాదించానక్కడ :) (అయితే అక్కడ బ్లాగు డాలర్లలో కొంత మంది ఆస్తి 13-14 అంకెలలో ఉండేది).

    ఈ మధ్య కాలంలో "నిజమైన" స్టాకు మార్కెట్టును గమనించటం లేదా అందులో పెట్టుబడి పెట్టడం అనే ఒక కొత్త వ్యాపకం మొదలుపెట్టాను. ఇక్కడ కొనటం అమ్మటం ఎంత నిజమో డబ్బులు పోవటం రావడం కూడా అంతే నిజం! నేను స్టాకు మార్కెట్టుకి కొత్త కాబట్టి పెట్టుబడి పెట్టేబదులుగా వాటి హెచ్చుతగ్గులు పరిశీలిస్తున్నాను. అందుకుగాను ఒక నాలుగైదు షేర్లను ఎంచుకుని వాటిని పరిశీలించటం మొదలు పెట్టాను. వాటి హెచ్చుతగ్గులు పరిశీలిస్తుంటే నా చిన్న బుర్రలో ఉన్న లాజిక్కుకి అందనివి ఏవేవో జరిగిపోతున్నాయక్కడ...

    ఉదాహరణకు ఒక "క", "చ" అనే రెండు కంపెనీల షేర్లను తీసుకుందాం. రెండు కంపెనీల షేర్లూ పెరుగుతుతున్నాయి. అంతా బాగానే ఉందికదా అనుకుంటూ వాటి తీరుతెన్నులు పరిశీలించాలని అనుకున్నాను, అప్పుడే గమనించాను "చ" అనే కంపెనీ షేర్లను అమ్మే వాళ్ళకంటే కొనేవాళ్లు ఎక్కువ మంది ఉన్నారు, ఇలాంటప్పుడు దాని షేరు విలువ పెరగటం సహజం. అయితే "క" అనే కంపెనీ స్టాకులను కొనేవారి కంటే అమ్మేవాళ్ళు 3-4 రెట్లు ఎక్కువమంది ఉన్నారు, అయినా దాని విలువ ఆ రోజంతా పెరుగుతూనేఉంది. అంతేకాదు "చ" కంటే "క" విలువ బాగా పెరిగింది ఆ రోజు. దీని బట్టి కంపెనీ షేర్ల విలువలు కొనటం/అమ్మటం మీద మాత్రమే ఆధారపడవని తెలుసుకున్నాను. మరింకా వేటిమీద ఆధారపడతాయనే ఇంకో పెద్ద ప్రశ్న మిగిలిపోయింది :(

    సరే ఇంక ఇక్కడ చర్చించుకోదగ్గ ఇంకో విషయం ఏమిటంటే ప్రతి 5 నిమిషాలకొకసారి refresh బట్టన్ని నొక్కి షేరు విలువ ఎంత పెరిగిందో చూసుకోవటం మొదలు పెట్టాను. కూడలిని కూడా ఇన్నిసార్లు నేనెప్పుడూ refresh చేయలేదు!... ఇంకా ఏ షేర్లనూ కొనకుండానే ఇంతలా ప్రతీ ఐదు నిమిషాలకొక సారి చూస్తున్నానంటే మరి వందల సంఖ్యలో షేర్లను కొని అమ్మేవారి పరిస్తితి ఎలాగుంటుందో!... లేక కొత్తొక వింత, అన్నట్లు స్టాకు మార్కెట్టు క్లబ్బులో కొత్తగా జేరిన వాళ్లే ఇలాంటి విపరీతమైన ఉత్సాహాన్ని ప్రదర్శిస్తూ ఉంటారా?...

    ఇదంతా అయిన తరువాత ఇంక పరిశీలించింది చాలనుకుని, ధైర్యం చేసి నా "బిగినర్స్ లక్కు"ను పరీక్షించుకుందామని అంతకుముందు తగ్గి ఇప్పుడు పెరుగుతున్న రెండు కంపెనీల షేర్లను తలా మూడు కొన్నాను... తీరా కొన్న ఐదు నిమిషాలలోనే షేరుకి ఐదు శాతం చప్పున వాటి విలువ పడిపోయింది... స్టాకు మార్కెట్టులో కనీసం "బిగినర్స్ లక్కు" కూడా పని చేయదని ఇంకో పాఠాన్ని నేర్చుకున్నాను. ఇప్పుడు వాటిని వదిలించుకుందామని ప్రతీ రెండు నిమిషాలకోసారి వాటి విలువలోని హెచ్చుతగ్గులను పరిశీలించటం మొదలు పెట్టాను...
  • బెంగుళూరు - లాల్‌బాగ్
    Lalbagh
    అసలు పరిమాణం

    చాలా రోజుల క్రితం తీసిన పొటో ఇది, అప్పుడు సమయం లేక ఇప్పుడు పోస్టు చేస్తున్నాను. రెండు మూడు రోజుల నుండి ఇక్కడ బెంగుళూరులో అసలు ఎండనేదే కనపడటం లేదు. మధ్యాహ్నం ఒంటిగంటా రెండు గంటలకు కూడా బాగా చలనిపిస్తుంది. ఆఫీసులో ఏసీ కంటే బయటే ఎక్కువ చలిగా ఉంది. నాలుగు వారాల క్రితం తీసాను ఈ ఫొటోను, అప్పుడు చూడండి ఎంత ఎండ ఉందో! బెంగుళూరు లాల్‌బాగ్‌లో ఇలాంటి కనువిందు కలిగించే దృశ్యాలు ఇంకా చాలా ఉన్నాయి, త్వరలోనే మరికొన్ని ఫొటోలు పెడతాను.
  • అమెరికా తెలుగు కథ (మొదటి సంకలనం)

    రెండు నెలల క్రితం ఈ పుస్తకాన్ని మా చుట్టాల ఇంట్లో చూసాను, అప్పటికే వాళ్లింట్లో చదవాల్సినవారందరూ చదివేసినట్లున్నారు, బీరువాలో ఓ మూలకెళ్లిపోయింది... ఏట్లాంటి కథలుంటాయో చూద్దామని మొదటి పేజీ చదవటం మొదలుపెట్టాను, ఇంకొంత సేపటికి పుస్తకంలోని మొదటి కథ పూర్తయిపోయింది; అప్పుడే ఇది మొత్తమంతా చదవాల్సిన పుస్తకం అని అనిపించింది. ప్రస్తుతం ఈ పుస్తకాన్ని రెండోసారి చదువుతున్నాను!

    ఈ పుస్తకాలలోని కథలు చదువుతున్నంత సేపూ బ్లాగులలోని పోస్టులు చదువుతున్నట్లే అనిపించింది. కొన్ని చాలా బాగున్నాయి, కొన్ని పరవాలేదనిపించాయి, ఇంకొన్ని నాకు నచ్చలేదు(అర్థంకాలేదు?). కానీ ఈ పుస్తకంలో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే ఇందులో ఉన్న కథలన్నీ, రచయితల అనుభవాల నుండి పుట్టినవే ఉన్నాయి (నాకలా అనిపించింది).

    ఆ పుస్తకంలోని మొదటి కథే (యాదృచ్చికం) నాకు అన్నింటికంటే చాలా బాగా నచ్చిన కథ, అసలు ఆ కథే నన్ను పూర్తి పుస్తకాన్ని చదివేటట్లు చేసింది. ఆ తరువాత వెంటనే చెప్పుకోవలిసిన కథ "తుపాకి", ఇది ఆ పుస్తకంలో అన్నిటికంటే పెద్దకథ. కానీ అది కాదు దీని గొప్పదనం. కథలోని కధనం పాత్రలను మలచిన తీరు, నాకు బాగా నచ్చాయి. ఈ కథను చదివితే అమెరికా జీవితాన్ని విహంగవీక్షణం చేసిన అనుభూతికి లోనవుతారు. పుస్తకంలోని కథలను చదువుతున్నంతసేపూ వాటి పైన ఒక సమీక్షరాద్దామని అనుకున్నాను. కానీ రాయటం మొదలు పెట్టిన తరువాత తెలిసింది సమీక్షను రాయటం అంత సుళువు కాదని. ఈ పుస్తకం లోని 50% కథలు చాలా బాగున్నాయి, ఇంకో 30% బాగున్నాయి. మిగిలిన 20% కథలు, పేజీలు నింపటానికి మాత్రమే, అని చెప్పను కానీ, నాకు అర్థంకాని ఇంకో స్థాయిలో రాసారేమో అని అనిపించింది, వాటిని పూర్తిగా చదవటానికి చాలా కష్టపడాల్సి వచ్చింది.

    పొరుగింటి పుల్లకూర, అమెరికా ఇల్లాలు, అమ్మ, లక్ష డాలర్లు, అగాధం మొదలైన కథలు చదువుతుంటే మాతృదేశాన్ని వదిలి, అమెరికా వచ్చి, చాలా కోల్పోయామేమోననే భావన నుండి తయారయ్యాయి. అంతేకాదు, మనం విన్న "కుందేలూ-తాబేలు" కథకు ముందు జరిగిన కథను వేమూరిగారు అద్భుతంగా వివరించారు. "తెమీనచా-నమీతెచా" అంటూ సత్యం మందపాటిగారు బాగా వాతలు పెట్టారు. "సావాసం సహవాసం", పదాల మధ్యన తేడాను, "ఆవగింజ ఆంతర్యాన్ని" కూడా కథలరూపంలో వివరించేసారు. పుస్తకంలోని కథలు ఒక ఎత్తయితే, పుస్తకం చివరన కథకులను పరిచయం చేయటం ఇంకో ఎత్తు. వారందరు ఒక్క జీవితకాలంలోనే అన్ని అద్భుతాలు ఎలా సాధించారా అనిపించటం కద్దు.

    ఈ పుస్తకం మొత్తంలో నాకు అస్సలు అర్థంకాని కథ "లుండెర్ క్లుంపెన్". నేను రెండు సార్లు చదివినా, ఆ కథ ద్వారా రచయిత ఏంచెప్పాలనుకున్నడో, నాకు అస్సలు అర్థం కాలేదు.

    ఈ పుస్తకంలో ఒక్కో కథా 2-3 పేజీల నుండీ 15-20 పేజీల వరకూ ఉంది. మొత్తం 35 కథలు. రొజుకో కథ చప్పున పుస్తకాన్ని పూర్తిచేయడానికి నెలపైనే పట్టింది నాకు. "వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా" ప్రచురించిన ఈ పుస్తకం ఖరీదు అమెరికాలో అయితే 15డాలర్లు, భారతదేశంలో 100 రూపయలు మాత్రమే.

    అనట్లు ఈ పుస్తకంలో మన నాసీగారి కథ కూడా ఒకటి ఉందండోయ్.
  • ఎలా జరిగింది?
    అసలు మొదటిగా ఏం జరిగిందో తెలుసుకుందాము. ఆ తరువాత ఎలా జరిగింది అని అలోచిద్దాము. నా బ్లాగు మొదలు పెట్టిన కొత్తలో ఎప్పుడొ online photo hosting sites కోసం వెతుకుతున్నప్పుడు నాకు flickr గురించి తెలిసింది. ఇంకొన్ని వేరే సైట్లు ఉన్నా కూడా flickr నచ్చినంతగా అవి నచ్చలేదు. అప్పుడప్పుడూ అలా flickrలో తిరుగుతున్నప్పుడు కొంత మంది పేర్ల పక్కన pro అని కనపడుతూ ఉండేది. మొదట్లో మంచి మంచి ఫొటోలు తీసేవాళ్ల పక్కన అలా pro అని వస్తుందేమో అని అనుకున్నాను, తరువాత తెలిసింది లెండి, ప్రతీ నెలా రెందు డాలర్లు కడితే మన పేరు పక్కన కూడా pro అని వచ్చేస్తుందని తెలిసింది. నాకంతెందుకులే అని, ఉచిత సేవలతోనే సరిపెట్టుకున్నాను.

    అయితే మొన్న 21న జరిగిందది. flickrలో నా పేరు పక్కన కూడా pro అని కనిపించటం మొదలయింది, అలా అని నేను డబ్బులేమయినా కట్టానా అంటే, ఒక్క రూపాయి కూడా కట్టలేదు. మరింకెందుకు అలా కనిపించటం మొదలయ్యింది. ఇంకా వివరాలలోకి వెళితే నేను ఇంకో నెలపాటు(వచ్చే నెల 21 వరకు) అలా నా పేరు పక్కన proని చూసుకుంటూ మురిసిపోవచ్చని తెలిసింది.

    ఇప్పుడు అసలు ప్రశ్న flickrలో నేను డబ్బులు కట్టకపోయినా, నా ఎకౌంటు proగా ఎలా మారిపోయింది? ఇలా జరగటానికి నాకు రెండు కారణాలు కనపడుతున్నాయి. ఈ రెండిటిలో ఏదయినా కవొచ్చు. ఎవరయినా నాకు బహుమతిగా పంపించుండొచ్చు... కానీ అలా నాకు ఒక pro ఎకౌంటు కొంటునట్లు ఎటువంటి మెయిల్లు రాలేదు... ఇంక రెండోది flickrలో ఇదొక feature లాంటి bug అనుకుంటా :)

    మీకీ సంగతి తెలుసా; flickrలోకి మీరు ఎక్కించిన ఫొటోలు, ఇతరులకు నచ్చుతాయా నచ్చవా అనే అంశం పరిశీలించి వాటిని ఆ రకంగా వర్గీకరిస్తుంది. ఇది కూడా మనుషులు కాకుండా ప్రోగ్రాములే చేస్తాయని నా వుద్దేశం...
  • తెలుగులో అతి తరచుగా ఉపయోగించే అక్షరం ఏది?
    ఆంగ్లంలో "E" అనే అక్షరాన్ని అతి తరచుగా వాడతారని మనందరికీ తెలిసిందే, మరి తెలుగులో కూడా అటువంటి అక్షరం ఒకటి ఉండాలి కదా... ఈ ప్రశ్నకు జవాబును కనుక్కోవటానికి తెలుగు వికీపీడియాలో ఉన్న సుమారు 58 వేల పేజీల సమాచారాన్ని సేకరించి పరిశీలించాను. అయితే చివరికి వచ్చే ఫలితాల నాణ్యత కాపాడటానికి 2KB కంటే తక్కువ సమాచారం ఉన్న పేజీలను పరిశీలన నుండి తప్పించాను, ఇలా తప్పించటం వలన దాదాపు అన్ని గ్రామాల పేజీలు, చాలా మట్టుకు సినిమా పేజీలు విశ్లేషణ నుండి బయట పడ్డాయి. అంటే విశ్లేషణకు ఇక మిగిలిన పేజీలలో ఉన్న సమాచారం మొత్తాన్ని ప్రోగ్రాములతో కాకుండా దాదాపూ పూర్తిగా మనుషులతోనే సృష్టించారు.

    ఈ గణాంకాలు తీసుకుంటున్నప్పుడు వత్తులను కూడా మామూలు అక్షరాలతో సమానంగా లెక్కగట్టాను. ఈ గణాంకాలను తెలుగు వికీపీడియాలోని 3419 పేజీలలో ఉన్న సుమారు 66 లక్షల అక్షరాల(వత్తులు గుణింతాలు కలుపుకుని) నుండి సేకరించాను.

    అచ్చులలో " లేదా ి" ఎక్కువగా ఉపయోగిస్తుంటే, హల్లులలో ""ను అత్యధికంగా ఉపయోగిస్తున్నారు. ఈ రెండిటికంటే కూడా ఎక్కువగా అచ్చు-హల్లు కాని (పొల్లును) ఉపయోగిస్తున్నారు!!!

    వికీపీడియాలో నాకు వచ్చిన పూర్తి ఫలితాలను ఇక్కడ చూడండి.

    ఇలాంటి విశ్లేషణ ఇంతకు ముందే ఒకసారి అన్నమైయ్య పాటలపై ఒకసారి, రచ్చబండ గుంపులోని చర్చలో ఇంకోసారి జరిగాయి. ఈ రెండు చోట్లా మట్టుకు "" అనే అక్షరం అత్యధికంగా వాడుతున్నట్లుగా గణాంకాలు వచ్చాయి.
  • నేనూ ఒక ఇంటివాడినయ్యాను
    నిజం చెప్పాలంటే నా బ్లాగు ఒక ఇంటిదయ్యింది, నేను కాదు :) ఈ మధ్యనే నేను ఒక 10 డాలర్లు పెట్టి ఒక URL కొనుకున్నాను, ప్రతీ సంవత్సరం ఇలా 10 డాలర్లు కడుతూ ఉండాలంట!. గూగుల్ ద్వారా గోడాడీలో కొనుక్కున్నాను. అంటే గూగులే ఇప్పుడు నా సైటుకు కావలిసిన స్టోరేజీ, బ్యాండ్‍విడ్తూ ఇచ్చి వాటి నిర్వహణా బాద్యతలను కూడా ఉచితంగా చేపడుతుంది. కాకపోతే మనకు ఇక్కడ వెబ్ సర్వర్, డేటాబేసు సర్వర్ ఉండవు.

    URL కొనుక్కున్న తరువాత నేను చేసిన కొన్ని ప్రయోగాల వలన, తేనెగూడులో నా పాత టపా మూడు సార్లు వచ్చింది, ఆ తరువాత నేను తేనెగూడులో ఉన్న click analysisతో చేసిన ప్రయోగాల వలన, అక్కడ ఉండే "ఎక్కువగా చూచిన టపాలు" అనే శీర్షికలో మొదటి మూడు టపాలూ నావే వచ్చేసాయి :)
  • ఈ ఫోటోకి పేరు పెట్టలేదు
    మొన్న బెంగులూరు నుండి విజయవాడ వెల్తున్నప్పుడు ఇతని ఫొటోను తీసేసాను. ఫొటో తీస్తునప్పుడు నేను ట్రెయిను లోపట ఉండటం వలన, అతనికి నేను ఫొటోను తీస్తునట్లు తెలీదు. ఎందుకో ఈ ఫొటో నాకు చాలా బాగా నచ్చింది. ఎవరయినా ఈ ఫొటోకి ఒక మంచి పేరు పెట్టగలరు.

    Caption Wanted
  • మధురైకి వెళ్ళి వచ్చాను
    ఈ మధ్యన ఒక తోటి ఉద్యోగస్తుడి పెళ్లికని మధురై వెళ్ళి వచ్చాను. ఇంతకుమునుపే ఒక సారి కన్యాకుమారి వెళ్తూ మధురై కూడా వెళ్లాను. కానీ అప్పుడు మధురైలో పేరెన్నికగన్న మధుర మీనాక్షిగుడి నొక్కదానిని హడావిడిగా చూసేసి వచాను. ఈ సారి మధురైలో ఇంకొంత నింపాదిగా తిరిగటానికి అవకాశం లభించింది. పొద్దున్నే మీనాక్షీగుడికి వెళ్లాము, గుడిలో విగ్రహాన్ని ఎక్కడికో ఊరేగింపుకి తీసుకుని వెళ్ళటంవలన గుడిని మూసేసారంట! గుడి పరిసరాలలోనే ఉండే 1000 స్థంభాల హాలులో ఉండే మ్యూసియంను ఓ చుట్టు చుట్టి వచ్చేసాము. తరువాత పెళ్లివారింటికి వెళ్ళి తమిళులకు ప్రీతిపాత్రమైన సాంబారుతో భోజనం కానిచ్చేసి మధురైకి 20కిమీల దూరంలోనే ఉండే అలగర్‌కోవిల్ గుడికి బయలుదేరాము.

    అలగర్‌కోవిల్ తమిళనాడులో ఉన్న పురాతన దేవాలయాలలో ఒకటి, ఇది అలగర్ అనే కొండపైన ఉంటుంది. కొండ కింద ఒక గుడి, పైన రెండు గుళ్లు ఉంటాయి. మేము అక్కడికి వెళ్ళేటప్పటికి సాయంత్రం 5 అయిపోయింది. కింద ఉన్న గుడికి మరమత్తులు చేస్తున్నారు. కొండమీద ఉండే గుడికి రోడుమార్గం ఉంటుంది. మేము మాత్రం ఆ రోడ్డుకు ఆనుకుని ఉండే అడవిమార్గంలో నడుచుకుంటూ కొండ మీదకి వెళ్లటానికి నిశ్చయించుకున్నాము. (అసలు అలా trekking చేయొచ్చన్నే అక్కడకు వెల్లాము)

    well
    ఈ బావి అడవిదారి మొదట్లోనే కనపడుతుంది. ఇక్కడిదాకా రావాలంటే కొండ కింద ఉన్న గుడి లోపలకు వెళ్లి, కొండకు గుడికి అడ్డంగా కట్టిన పెద్ద గోడలో ఉన్న ఒక చిన్న ద్వారం గుండా వెళ్లాలి.

    damp way
    dark forest
    వర్షాకాలం అవ్వటం వళ్లనేమో అడవి చాలా దట్టంగా ఉంది, మేము బస్సులో కొండను చేరుకునే వరకూ వర్షం పడుతూనే ఉండటం వలన నేలంతా తడి తడిగా ఉంది.

    road way
    అలా అడవిమార్గంలో కొంత దూరం నడిచిన తరువాత రోడ్డు ఇలా రోడ్డు కనపడింది. అడవిలోనే వెళ్లటానికి మాకు ఇంక దారి కనపడలేదు. సరే అని ఇంక రోడుమార్గంలోనే మిగతా కొండ ఎక్కడం మొదలు పెట్టాము.

    tired men
    అలా నడుస్తూ నడుస్తూ నడుస్తూ ...

    first hilltop
    సుమారు గంటన్నర నడక తరువాత ఇలా కొండపైన ఉన్న గుడి ఆనవాలు కనపడింది. ఇక్కడ కొండపైన ఉండే మొదటి గుడి ఉంటుంది. ఇక్కడి నుండి ఇంకో 10-15 నిమిషాలు నడిస్తే రోడ్డు అంతమయ్యి ఇంకో గుడి ఉంటుంది. ఈ రెండో గుడిని చత్తాచెదారాన్ని పేర్చడానికి వాడుతున్నారా అని అనిపిస్తుంది.

    అలా కొండపైవరకూ వచ్చిన తరువాత అక్కడ ఏంచేయాలో తోచక మళ్లీ కిందకు దిగటం మొదలుపెట్టాము. ఈ కొండ నిండా బోలెడన్ని కోతులు ఉంటాయి, అవి మన దగ్గర ఉన్న సంచీలలో ఏవయినా తినుబండారాలు ఉన్నాయేమోనని వాటిని లాక్కోవటానికి ప్రయత్నిస్తూ ఉంటాయి, కాబట్టి మీరు ఎప్పుడయినా ఇక్కడికి వెళ్ళినప్పుడు వాటితో జాగ్రత్తగా ఉండండి.

    couple
    కొండమీద నుండీ దిగుతున్నప్పుడు ఇలా ఒక జంట కనపడితే కెమెరాతో ఒక క్లిక్కు క్లిక్కాను. జంట ఎక్కడా కనపడటంలేదంటారా :) అయితే ఫొటో అసలు సైజులో వెతకండి కనపడుతుందేమో.

    nature2
    nature1
    కొండదిగుతున్నపుడు కనిపించిన ప్రకృతి దృశ్యాలు.

    తరువాతి రోజు పెళ్లిలో సాంబారులో అన్నం కలుపుకు తినేసి, మధురైలోనే ఉండే నాయక్ మహల్ చూడటానికి వెల్లాము. 17వ శతాబ్ధంలోనే అంత పెద్ద భవనాన్ని కట్టడం ఒక ఎత్తయితే పైకప్పుతో సహా భవనం మొత్తాన్ని ఇటుకలూ సున్నంతోనే కట్టేసారు, అయినా ఇంకా చెక్కుచెదరలేదు.

    nayak mahal
    ప్రస్తుతం మహలులో ఒక దర్బారు, ఆసనం, దర్బారు చుట్టూ ఒక వరండా కొన్ని చిన్న చిన్న గదులూ మిగిలి ఉన్నాయి. మిగతా చాలాభాగం ద్వంసం చేసేసారంట. ఒక గదిలో మహలు చుట్టుపక్కల లభ్యమైన రాతిశిల్పాలు, టెర్రకోట బొమ్మలను ప్రదర్శనకై ఉంచారు.

    ఇంకొన్ని విశేషాలు:
    • బెంగుళూరులోనూ, హైదరాబాదులోనూ ఫుట్‌పాతులపై అమ్మే దొంగ CDలను అమ్మటానికి ఇక్కడ పెద్ద పెద్ద బ్యానర్లు పెట్టి అమ్ముతున్నారు. కొనే ముందు CDలో ఉన్న సినిమా ఎంత క్వాలిటీ ఉందో చూసుకోవటానికి డీవీడీ ప్లేయర్లను కూడా ఏర్పాటు చేసారు!!!
    • మధురైలో బాగా ప్రాచుర్యం పొందిన పానీయం "జిగర్ తండా".
    • మధురైలో నుండీ 100-150కీమీల దూరంలో మంచి మంచి జలపాతాలు కూడా ఉన్నాయి, కానీ మేము వాటిని చూడలేకపోయాము.
  • రూపాయి విలువ
    నేను ఇన్ని రోజు డాలరుతో రూపాయి విలువ పెరగటం వలన మనకు ఇక్కడ అన్నీ లాభాలే అని భావిస్తూ ఉండేవాడిని. అంటే డాలరు విలువతో మన రూపాయి విలువ సమానంగా అవుతున్న కొద్దీ ఇక్కడ మన జీవన ప్రమాణాలు కూడా అమెరికా జీవన ప్రమాణాలకు దగ్గరగా అవుతాయి అని అనుకుంటూ ఉండే వాడిని. 1000 డాలర్లు ఉండే ల్యాప్‌టాపుని ఇప్పుడు 40000 రూపాయలకే కొనుక్కోవచ్చు, అంటే ఇక్కడ మనం సుమారు 10000 మిగుల్చుకున్నాము. ఇంకో రకంగా చెప్పాలంటే రూపాయి విలువ పెరుగుతున్నంత కాలం, మన కొనుగోలు శక్తి పెరుతుంది. అంటే దిగుమతుల వ్యాపారం కనీ వీనీ ఎరుగనంత లాభాలు ఆర్జిస్తున్నాయన్న