Nagaraja.in
From Indian Web Showcase
External Links: Nagaraja.in Alexa | Whois | Future PR | Link Popularity | Domain Strength | Site Age | Compete.com |
Title
తెలియలేదనే కారణం చేత నిజం అన్నది కాకుండా పోదు - రిచర్డ్ బాక్
Description
తెలియలేదనే కారణం చేత నిజం అన్నది కాకుండా పోదు - రిచర్డ్ బాక్
Address
Languages
English
External links
Start Page
తెలుగు నేల
- Bottled Consciousness - Harry Palmer
- జోకానువాదం - 46: కంటి-చెవి డాక్టరు
ఒక జర్నలిస్టు ఆసుపత్రికి వెళ్ళి, "నేను కంటి-చెవి డాక్టరును చూడాలి" అని రిసెప్షనిస్టును అడిగాడు."మా దగ్గర అటువంటి డాక్టర్లు లేరు", అన్నది ఆమె, "మీకు వేరే డాక్టరు కావాలా?". "లేదు నాకు కంటి-చెవి డాక్టరే కావాలి," పట్టుదలగా అన్నాడా పాత్రికేయుడు. "అటువంటి డాక్టర్లు ఉండరు అనుకుంటాను," బదులిచ్చింది ఆవిడ. "కంటి డాక్టర్లు ఉన్నారు, ముక్కు-చెవి-గొంతు డాక్టర్లు ఉన్నారు, అయినా మీరు కంటి-చెవి డాక్టరు కోసం ఎందుకు అడుగుతున్నారో తెలుసుకోవచ్చా?".
"ఎందుకంటే...నాకు కనబడేది ఒకటి, వినబడేది మరొకటి", విషాదంగా మారిపోయింది ఆయన [...] - సెంట్రల్ ఇల్లినాయిలో వార్తా పత్రిక
నేను మరి కొందరు మిత్రులతో కలిసి మధ్య ఇల్లినాయిస్ (సెంట్రల్ ఇల్లినాయి)లోని బ్లూమింగ్టన్, అర్బనా-షాంపెయిన్, డికేటర్, పియోరియా మరియు స్ప్రింగ్‌ఫీల్డ్ అనే అయిదు ఊర్లను కవర్ చేస్తూ ఒక ఇంటర్నెట్ వార్తా పత్రికను నడపాలని ప్రయత్నాలు మొదలుపెట్టాము. విజయదశమి నాటి నుండి మొదలుపెట్టాలి అని నా షెడ్యూలు. మొదటి కొన్ని నెలలు ప్రయోగాత్మకంగా నడిపి, జనవరి తరువాత పత్రికను రిజిష్టరు చేయాలని నా ఆలోచన. ఇప్పటికి వివిధ ప్రదేశాల నుండి 25 మంది స్నేహితులు సహకరించడానికి ఒప్పుకున్నారు, టెక్నాలజీ [...] - జోకానువాదం - 45: మనలో పాపం చేయని వారు…
నిస్సహాయతతో పరిగెడుతున్న దీన యువతిని, ఆమె వెనకాల రాళ్ళతో పరిగెత్తుతున్న గుంపును చూసిన ఏసు, వారిని ఉద్దేశించి, "ఎందుకలా ఆవిడ వెనకాల పరిగెత్తుతున్నారు" అని సంయమనంతో ప్రశ్నించాడు."అయ్యా, ఈమె ఒక వెలయాలు, మన చట్ట ప్రకారం ఆమెను రాళ్ళతో కొట్టి చంపాలి!" గుంపులో ఒకాయన జవాబిచ్చాడు. "ఆగండాగండి," గట్టిగా అన్నారు ఏసు, "ఎవరైతే ఏ పాపం చేయలేదో వారే మొట్టమొదటి రాయిని వెయ్యాలి". మబ్బుల నుండి ఒక చిన్న గులక రాయి ఆవిడ నెత్తి మీద ఠపీమని పడింది.
"మీరు ఆగండి [...] - (తెలుగు బ్లాగ్) సంఘం శరణం గచ్ఛామి
ఈ వారం శరత్ 'కాలం' అనే బ్లాగును కూడలి నుండి తీసివెయ్యడం, ఆ తరువాత ఇతరుల వ్యాఖ్యలకు సమాధానంగా అన్నట్లు కూడలి నిర్వహకుడు వీవెన్ కూడలి దృక్పథం అనే పేరు గల టపాను ఒకటి రాయడం జరిగింది. "ఊరికే ఉండటం ఉత్తమం" అనే ఒక భావన వల్లే మన సమాజం తరతరాలుగా భ్రష్టుపట్టిపోతుంది అనే నమ్మకం బలంగా ఉండటం వల్ల ఊరుకోక ఆ టపాకు నేను ఒక వ్యాఖ్యను రాసాను. కానీ ఒక టపాకు ఉన్నంత వ్యాప్తి [...] - పత్రి గారు: ధ్యాన వైభోగము
ఈ వీడియోలో పత్రి సార్ యోగి వేమన పద్యాలను పాడి, వాటి యొక్క అర్థాన్ని ఉదాహరణలతో వివరిస్తున్నారు.మొదటి భాగం:
రెండవ భాగం: - నాగలోకం: ప్రజా రాజ్యం, ప్రగతికి మార్గం
ఏనుగు బయల్దేరింది... ఎవ్వర్నీ పల్లెత్తు మాట అనకపోవడం అన్నది ఎంత అరాజకీయమో! అయినా మొరిగే వారు లేనంత భాగ్యులం కాదు, అటువంటి వనరులు పుష్కలంగా ఉన్నాయి మన దగ్గర. అప్పుడెప్పుడో చిన్నప్పుడు యెన్టీవోడికి చివరిసారి ఓటు వేశాను. ఆ తరువాత పవర్ పాయింటు, ఫాక్షను రెండూ వచ్చాయి. ఒక నిజాయితీ పరుడు వస్తాడు అనే ఆశ దాదాపు చచ్చింది (జేపీని మరచినప్పుడల్లా). అయితే అమాంతం ఉన్నఫళంగా మనందరిలో మార్పు వచ్చి లోక్ సత్తాకు ఓటు వేసి గెలిపించడానికి మనదేమీ [...] - జోకానువాదం - 44: దేవుడు, భర్త, భార్య
ఒకాయన పొలంలో తన భార్యను గురించి, ఆవిడ యొక్క మంచితనాన్ని గురించి, ఆవిడను పెళ్ళి చేసుకోవడంలోని అదృష్టం గురించి ఆలోచిస్తూ తిరుగుతున్నాడు.దేవున్ని అడిగాడు, "ఆమెలో ఎందుకు అంత దయను పుట్టించావు?" దేవుడి జవాబు, "ఆమెను నీవు ప్రేమించడానికి నాయనా" "ఆమెను ఎందుకు అంత అందంగా తయారు చేశావు?" "ఆమెను నీవు ప్రేమించడానికి నాయనా" "అంత రుచికరమైన వంటలను ఎందుకు నేర్పావు?" "ఆమెను నీవు ప్రేమించడానికి నాయనా"
రెండు క్షణాలు ఆలోచించిన పిమ్మట: "కృతజ్ఞత లోపించింది అని అనుకోవద్దు ప్రభూ, ఆమెను ఎందుకు అంత తెలివి లేని [...] - పత్రీజీ - Journey to the soul: 1
ఈ జన్మలో నేను కలిసిన అతి గొప్ప వ్యక్తులలో బ్రహ్మర్షి సుభాష్ పత్రి గారు ఒకరు. ఈ గురువు గారి గురించి ఇక్కడ రాసి మీకు పరిచయం చేసే అదృష్టం దొరకడం అన్నది ఒక మహద్భాగ్యం, నాకు చాలా పెద్ద విషయం. పత్రీజీ, పత్రి గారు, సార్ అని అందరు గౌరవంగా పిలుస్తుంటారు. ఎవరైనా గురువు గారు అని ఈయన కాళ్ళు మొక్కితే, వెంటనే వాళ్ళ కాళ్ళు మొక్కుతుంటారు :) అదే లెఖ్ఖన ఎవరైనా నోరు జారితే [...] - Source Beingness - మూల స్థితి తత్వం
మనలో ప్రతి ఒక్కరమూ ఏదో పాఠశాలలో చదువుకొని ఉంటాము. మనకు నచ్చిన టీచర్లు ఉంటారు, అయితే వారి బోధనల యొక్క వీడియోలు దొరకడం దాదాపు అసాధ్యం! భవిష్యత్తులో సాంకేతికంగా ఇంకా ముందుకు పోయినప్పుడు ఈ కొరత ఉండకపోవచ్చు. నాకు చదువు నేర్పిన ఒక మాస్టారు యొక్క వీడియోను పరిచయం చేసే అదృష్ట భాగ్యం నాకు ఇక్కడ కలిగింది - పేరు హారీ పామర్, ఓర్లాండో, ఫ్లోరిడా నివాసి.అవతార్ అనే పేరు గల ఆధ్యాత్మిక బోధన యొక్క సృష్టికర్త.
ఈ [...]
